ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద హరితహారం చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, సురేందర్, జంగయ్య యాదవ్, సురేష్ నాయక్, అంజమ్మ, రాజు ముదిరాజ్, జగదీష్, యాదగిరి, నరేందర్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, సల్లావుద్దీన్, అనిల్ సింగ్, నారాయణ, అక్బర్, మధు, గోవింద్, కృష్ణ యాదవ్, నటరాజ్, నరేష్, నగేష్, మహాదేవప్ప, కుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

గోపన్ పల్లి తండా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో మొక్కలు నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here