సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, గోపినగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెయిన్ రోడ్డు లో విద్యుత్ స్తంభాలు, రోడ్లు సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. త్రాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో నీటి గుంతలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదా గౌడ్, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గఫ్ఫార్, శ్రీకాంత్, లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, పటోళ్ల నర్సింహ, సాయి, ఏఈ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

కాలనీ వాసులతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here