నేతాజీ నగర్ లో పర్యటించిన కార్పొరేటర్, డీసీ

నమస్తే‌ శేరిలింగంపల్లి: గులాబ్ తుపాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీ లోతట్టు ప్రాంతాలలో డిప్యూటీ కమీషనర్ వెంకన్న, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ అత్యవసర పరిస్థితుల్లోనే అన్ని జాగ్రత్తలతో బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, ఏఈ కృష్ణవేణి, చందానగర్ సిఐ కాస్ట్రో రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్, నేతాజీ నగర్ ఉపాధ్యక్షుడు రాయుడు, వినయ్ కుమార్, బాలరాజు,రవి నాయక్, కుమార్, వెంకటేష్,బాలరాజు సాగర్, , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ నగర్ లో పర్యటించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here