శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ సోమవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్‌గా శేరిలింగంపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానన్నారు. ప్రజలు తనకు మరొక సారి ఓటు వేసి గెలిపించాలని కోరారు.







