చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో సోమవారం డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రెడ్డికి మద్దతుగా డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంజుల రెడ్డికి ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, కాలనీవాసులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







