శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్, భారతి నగర్ (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.59,06,844 ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి చెక్కుల రూపేణా PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గంగాధర్, చాంద్ పాషా, ఓ. వెంకటేష్, రజినీకాంత్, తిరుపతి, జాకీర్, పవన్ గౌడ్, నరేందర్ బల్లా, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.