శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిని కలిసి ఖాజాగూడలో పెద్ద చెరువు వద్ద సుందరీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఒక కోనేరు నిర్మించాలని కోరారు. గణేష్, బతుకమ్మ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు కైతాపురం జితేందర్, నక్క శివ కుమార్, కైలా రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.






