శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని కొత్త కుంట చెరువు సుందరీకరణలో భాగంగా GHMC, GENPACT, UNITED WAY హైదరాబాద్ IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా చేపట్టిన సుందరీకరణ పనులు, అభివృద్ధి పనులు పూర్తయిన సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, IT సంస్థ ప్రతినిధులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెరువును ప్రారంభించి మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ GHMC, GENPACT, UNITED WAY హైదరాబాద్ IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా కొత్త కుంట చెరువుకు దశ దిశ మారిందని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతుందని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగిందని అన్నారు. మురికి కూపంలాంటి చెరువును స్వచ్చమైన మంచి నీరు ఇచ్చే చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేసి నేడు చెరువును పునరుద్ధరణ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.