శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): అ పరమ శివుని దీవెనలతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతున్నానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఆయన ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమేశ్వరునికి అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం అని అన్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని శివరాత్రి నాడు వాడ వాడలా రోజువారీ ఉపవాస దీక్షలతో , జాగారంతో వేడుక చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ ముదిరాజ్, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ వాసులు వాటర్ రాజు, నరసింహ గౌడ్, సంతోష్, మల్లేశం, ప్రభు, నర్సింలు, బాబ్జీ, మహేష్, మూర్తి, గణేష్, శ్రీనివాస్, సంగమేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.