శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తగూడ, మార్తాండ్ నగర్ కాలనీలలో ఉన్న శివాలయం దేవాలయంలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరునికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినమని, శివుడికి అత్యంత ఇష్టమైన రోజని అన్నారు. శివరాత్రి నాడు వాడ వాడలా రోజువారీ ఉపవాస దీక్షలతో , జాగారంతో వేడుక చేసుకుంటారని, ఆ పరమ శివుడిని ఆరాధిస్తూ పరవశించే పవిత్ర రోజు మహా శివరాత్రి రోజు అని అన్నారు. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.