స్వీయ నియంత్ర‌ణ‌తోనే క‌రోనా క‌ట్ట‌డి సాధ్యం… ప్ర‌కాష్‌న‌గ‌ర్‌లో మాస్కులు పంపిణీ చేసిన సంగారెడ్డి…

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: హ‌పీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌కాష్‌న‌గ‌ర్‌లో శేరిలింగంప‌ల్లి టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు సంగారెడ్డి శ‌నివారం స్థానికుల‌కు పెద్ద మొత్తంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్వీయ నియంత్ర‌ణ‌తోనే క‌రోనా క‌ట్ట‌డి సాధ్య‌మ‌ని అన్నారు. లాక్‌డౌన్ మిన‌హాయింపుల‌తో వైర‌స్ విస్తృతి కొన‌సాగే ప‌రిస్థితి నెల‌కొంద‌ని, ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్కులు ధ‌రించాల‌ని సూచించారు. రెండు ద‌శ‌లు దాటి మూడ‌వ దశ వైపు క‌రోనా అడుగిడుతున్న నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు తోచిన రీతిలో 300 మాస్కులు పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, యువ‌కులు పాల్గొన్నారు.

సంగారెడ్డి అందించిన మాస్కుల‌తో స్థానిక యువకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here