నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ కమిటి ఆద్వర్యంలో పెట్రోల్ డిజిల్ ధరల పెంపుపై శుక్రవారం చందానగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గం సమన్వయకర్త రఘునందన్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి పాలనలో సామాన్యులు బతుకలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పెట్రోల్ డిజీల్ ధరలు రూ.100 లీటర్‌కు చేరుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంధన ధరలను నియంత్రించలేని ప్రధాని మోడి తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసర సరుకులతో దిగువ మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు మారెళ్ల శ్రీనివాస్, నాగేష్ నాయక్, ఆలీ అజ్గరీ భేగం, డీసీసీ కార్యదర్శి సందీప్‌రెడ్డి, మైనారిటీ చైర్మన్ అయాజ్‌ఖాన్, నాయకులు హరీ, రాజన్, కవిరాజ్, ఎన్ఎస్‌యూఐ చిరంజీవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
