సూప‌ర్‌స్ప్రెడ‌ర్స్ వ్యాక్సినేష‌న్‌ స్లాట్లు అమ్ముకుంటున్న ఎస్ఆర్‌పీ నాయ‌క్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: ఏకాంత్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: దేశ ప్ర‌జ‌లంద‌రికి ఉచితంగా వ్యాక్సినేష‌న్ ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనేక తంటాలు ప‌డుతుంటే జీహెచ్ఎంసీ సిబ్బంది టీకాల‌ను అమ్ముకుంటున్నార‌ని శేరిలింగంప‌ల్లి బిజేపి సీనియ‌ర్ నాయ‌కుడు ఉప్ప‌ల ఏకాంత్ గౌండ్ మండిప‌డ్డారు. వివేకానంద నగర్ డివిజన్ బాగ్అమీర్‌ వార్డు కార్యాలయంలో శనివారం ఉదయం స్థానికంగా ప‌నిచేసే ఎస్ఆర్‌పీ నాయ‌క్ మ‌రో వ్య‌క్తి స‌హ‌కారంతో ప్రైవేట్ వ్య‌క్తుల‌కు సూప‌ర్‌స్ప్రెడ‌ర్స్ వ్యాక్సినేష‌న్‌ స్లాట్స్ బుక్ చేస్తూ ఏకాంత్ గౌడ్‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఏకాంత్‌గౌడ్ మాట్లాడుతూ నిజ‌మైన సూప‌ర్‌స్ప్రెడ‌ర్స్‌కు ఉచితంగా ద‌క్కాల్సిన వ్యాక్సిన్‌ను సిబ్బందే ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని అన్నారు. గ‌త 10 ఏళ్లుగా డివిజ‌న్‌లోనే తిస్ట‌వేసిన ఎస్ఆర్‌పీ నాయ‌క్ ఒక ప్రైవేట్ వ్య‌క్తిని ఏర్పాటు చేసుకుని అత‌ని ద్వారా వ్యాక్సిన్ స్లాట్స్‌లు అమ్ముకుంటున్నాడ‌ని ఆరోపించారు. సాదార‌ణ ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు తీసుకుని సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌గా చిత్రీక‌రిస్తూ ఆన్‌లైన్‌లో వంద‌ల సంఖ్య‌లో స్లాట్లు బుక్ చేస్తున్నార‌ని అన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుడుపోయిన ఎస్ఆర్‌పీ, అత‌ని స‌హాయ‌కుడిపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేనియెడ‌ల ఎంత‌టి పోరాటానికైనా సిద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు.

బాగ్అమీర్‌ వార్డు కార్యాల‌యంలో ప్రైవేట్ వ్య‌క్తుల స్లాట్లు బుక్‌చేస్తున్న‌ ఎస్ఆర్‌పీ నాయ‌క్‌ను నిల‌దీస్తున్న బిజెపి నేత ఉప్ప‌ల ఏకాంత్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here