శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీ లో మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కావూరి, సెక్రటరీ నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన MRWA 4th ఎడిషన్ 5K రన్ కార్యక్రమంలో భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్, మాజీ BCCI చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేయడం కోసం ఈ రన్ ఎంతగానో తోడ్పడుతుందని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ 5k రన్ కార్యక్రమంలో 1500 మంది వరకు ఉత్సహంగా పాల్గొన్నారు. బ్రేక్ ఫాస్ట్ స్పాన్సర్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ రమేష్, టైటిల్ స్పాన్సర్ JK ఇన్ఫ్రా పట్టాభి , కో స్పాన్సర్లు మయురా ఆయుర్వేద, బచ్పాన్ ప్లే స్కూలు, BMS వెల్నెస్ సెంటర్, పల్స్ హార్ట్ హాస్పిటల్, యూరో కిడ్స్ ప్లే స్కూల్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.