శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట గ్రామంలో నాభిశిల (బొడ్రాయి) ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిలకు అభిషేకాలు నిర్వహించి ధూపం వేశారు. అలాగే దీపాలతో అలంకరించారు. అనంతరం బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.