నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని నాల విస్తరణ పనులపై గురువారం సమీక్ష జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అనంతరం మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఎస్ఈ చిన్నారెడ్డి బృందంతో కలసి దీప్తి శ్రీ నగర్, సత్యనారాయణ ఎనక్లేవ్, పీజేఆర్ ఎన్‌క్లేవ్ రోడ్డు వద్ద నాల విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ గారు మాట్లాడుతూ రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని, దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ పనులు, వరద నీటి కాల్వ పనులు ఎన్నో రోజుల నుండి చేపడుతున్న అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ లో భాగంగా సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులు, దీప్తి శ్రీ నగర్ పార్క్ నుండి పీజేఆర్ కల్వర్ట్ వరకు నిర్మిస్తున్న వరద నీటి కాల్వ పనులను వేగవంతం చేయాలని అన్నారు. వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈ శంకర్, డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు గురుచరణ్ ధూబే, శ్రీనివాస్, సత్యనారాయణ ఎనక్లేవ్ వాసులు లక్ష్మీ భవాని, రాధాకృష్ణ, లోకేష్, రవీంద్రనాథ్, హన్మంత రావు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
