శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పటేల్ జనరిక్ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ హాజరై తన చేతుల మీదుగా మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంతో పాటు, సరసమైన ధరలకు జనరిక్ మందులు లభించేలా పటేల్ జనరిక్ మెడికల్ స్టోర్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజల నమ్మకం, ఆదరణను పొందుతూ వ్యాపారంలో మంచి పేరు సంపాదించాలని, భవిష్యత్తులో మరిన్ని శాఖలుగా విస్తరించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొహ్మద్ అలీ, కాశీం సాహెబ్, జహీద్ భాయ్, గఫూర్ భాయ్, మొయిజ్ పటేల్, షాబీర్ సాహెబ్, తిరుపతి పటేల్, దామోదర్, సయ్యద్ సాయిద్ అహ్మద్, మొహ్మద్ అమీర్, వసీం సాహెబ్, అంజి, అజ్జు, ఫహీం, శంషు, షేక్ అస్లాం, ముక్తార్, మహబూబ్, కచ్చావా దీపక్ తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.





