శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ రోడ్డులోని జెన్‌ప్యాక్ట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 19న మధ్యాహ్నం 1:18 గంటలకు సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపక్కన పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7:20 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తెలుపు రంగు షర్ట్, నల్ల రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగిన వారు సమీప పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.






