నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆద్వర్యంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, పార్టీకి బలం చేకూర్చాలని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ శ్రేణులుఅందరూ సమిష్టిగా పని చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలలోకీ చేరేలా గా చూడాల్సిన బాధ్యత ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల పైన ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, నాయకులు బస్వరాజ్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నరసింహ, సాయి నందన్ ముదిరాజ్, కృష్ణ, రామ్ చందర్, తలారి విజయ్, కృష్ణవేణి, సబియా కుమారి, ఎస్ వీరేశం నాగరాజ్, శ్రీనివాస్, మాలకొండయ్య, బుచ్చయ్య, శ్రీనివాస్ యాదవ్, రాంబాబు, వినోద్, మల్లన్న, అశోక్, మల్లేష్, శ్రీనివాస్ కె, సాంబయ్య, రాజేందర్, బాబు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.