నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేస్ 1 లో రూ.13.83 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్క్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పార్కులు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం ఇస్తాయని, పార్క్ లో, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ పార్కును సుందరవణంగా తీర్చిదిద్ధి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి నాయకులు సత్యనారాయణ, సురేందర్ , ఆకుల యాదగిరి, వెంకటేష్ విష్ణువర్ధన్ రెడ్డి, గిరి, మల్లికార్జున్,రఘుపతి రెడ్డి, ముళగిరి శ్రీనివాస్, రాజు , శ్రీను, కాలనీ ప్రెసిడెంట్ భూషణ్, వైస్ ప్రెసిడెంట్ భునేశ్వరప్రసాద్, జనరల్ సెక్రటరీ మంత్రవాది, జాయింట్ సెక్రటరీ మణికంఠ, కోశాధికారి కన్నప్ప, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ సోమయాజి, రామ రావు, రాకేష్, గోపాలకృష్ణ, ఆఫీస్ మేనేజర్ రికీ రామ్ వర్మ, యుబిడి మేనేజర్ యసుఫ్ , సూపర్ వైజర్ గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.