శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీ శీతాకాల సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కొత్త సంవత్సరం జనవరి మాసంలో మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా చేయాలని, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. త్వరలోనే మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ శంకుస్థాపన చేసుకొని ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని , నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు, కొత్త ప్రతిపాదన పనులకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇరిగేషన్, SNDP అధికారుల సమన్వయం లోపం వల్ల చెరువుల సుందరీకరణ పనులు ఆగిపోయాయి అని, నాలాల విస్తరణ పనులలో జాప్యం నెలకొన్నదని, గతంలో శంకుస్థాపన చేసిన నాలా విస్తరణ పనులు 8 మీటర్ల వరకు కట్టారని, ఇప్పుడు 20 మీటర్లు, 40 మీటర్లు పొడిగించాలని అంటూ కాలయాపన చేస్తూ పనులు పూర్తి చేయడం లేదని అన్నారు. గతంలో శంకుస్థాపన చేసి అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల విస్తరణ పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని , అధికారుల సమన్వయం లోపం వల్ల నాలాల విస్తరణ కు మంజూరు అయిన నిధులు మురిగిపోతున్నాయని , ఇరిగేషన్, SNDP అధికారుల మధ్య సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నాలాల విస్తరణ పనులలో వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఈ అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.





