హుడా కాలనీలో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన రంగోలి పోటీలలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని గెలిచిన వారికి బహుమతుల‌ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రత్న, మాజీ ప్రధాని, అద్భుత కవి అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రంగోలి పోటీలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన, పాల్గొన్న ప్రతి మహిళకు, అలాగే మహిళా మోర్చా నాయకురాళ్ళకు. కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మ , విజయలక్ష్మి, సింధు రెడ్డి, స్రవంతి, పార్వతి, మహిపాల్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, అనిల్ గౌడ్ , మాణిక్ రావు, జితేందర్ , అజిత్ లలితా రెడ్డి , మమత, అనూష పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here