తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (న‌మస్తే శేరిలింగంపల్లి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం (ఐవిఎఫ్), కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువజన విభాగం రాష్ట్ర నాయకుడు కాపర్తి నాగరాజు, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోనే తలసేమియా చిన్నారుల కోసం అత్యధిక యూనిట్లను సేకరించిన సంస్థగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి రక్తదాతల సమూహం ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. నేటి వరకు 2400 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందని, ఈ శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ బాలు సేవలు ఎంతగానో అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్, MD ఇబ్రహీం , ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పార్శి ప్రకాష్, యూత్ అధ్యక్షుడు కట్ట రవికుమార్, నాయకులు చంద్రకాంత్, సంజీవ రెడ్డి, లక్ష్మీ నారాయణ, రమేష్, నిర్వాహకులు నవీన్, నగేష్, అజిత్, శివకుమార్, ప్రవీణ్, ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నరేష్, రామకృష్ణ, సాయి, జమీల్, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here