శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన వరదనీటి కాల్వ నిర్మాణ పనులపై పరిసర ప్రాంతా కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు మార్పు చేర్పుల పై గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎస్ఎన్డిపి చీఫ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, సంబంధిత అధికారులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎఫ్సీఐ వీడియా కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎస్ఎన్డిపి అధికారులతో గుర్నాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు నూతనంగా నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనుల మార్పు చేర్పుల పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, గుర్నాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు చేపట్టిన వరదనీటి కాల్వ నిర్మా ణ పనులను, పరిసర ప్రాంత కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వరదనీటి కాలువ నిర్మాణం పై అధికారులతో కలసి సమావేశం నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులు చేయడం జరిగిందని, వరదనీటి కాలువ నిర్మాణం మార్పు చేర్పులపై అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు డి ఈ వాసిధర్, ఎఈ వెంకటేష్, కాలనీ వాసులు రవీందర్ రెడ్డి, సమ్మెట ప్రసాద్, సుప్రజ, ఉమాకిషన్, జగన్, వెంకట్, సీతారాం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.