కొండాపూర్‌లో వన్ డే – వన్ వార్డు.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో గురువారం వన్ డే – వన్ వార్డు’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, సీఎంసీ కమిషనర్ డా. జి. సృజన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్, డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, HMWS డీజీఎం శ్రీహరి, మేనేజర్ అరుణ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వన్ డే – వన్ వార్డు కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్‌లోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, రోడ్లు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన సమస్యలను అక్కడికక్కడే పరిశీలించిన అధికారులు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలనీవాసులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సూచించారు.

కార్యక్రమంలో విద్యా సాగర్ రెడ్డి, కాకి నిర్మల, షేక్ చాంద్ పాషా, రాజేష్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, సుద్దపల్లి విజయ్ కృష్ణ, బాల్ రెడ్డి, తిరుపతి యాదవ్, రజనీకాంత్, ముప్పిడి మోహన్ బాబు, శివ కుమార్, విజయ్ శర్మ, దాసరి కృష్ణ, గిరిధర్, ఎస్వియన్ రాజు, బారేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, సురేందర్, సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, కొల్లూరి మధు ముదిరాజ్, గొల్లెం యాదగిరి, అబేద్ అలీ, గిరి గౌడ్, సత్తిబాబు, డా. శివకుమార్, జానయ్య, తోట విజయలక్ష్మి తదితరులు, అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here