అధికారులు స‌మ‌న్వ‌యంతో క‌ల‌సి ప‌నిచేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి, మియాపూర్, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల‌ పరిధిలోని ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, CMC ఇంజనీరింగ్ విభాగం, అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈఈ శిరీష, డీఈలు శ్రీదేవి, మౌనిక, ఏఈలు భాస్కర్, యుగేందర్, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here