దీప్తిశ్రీ నగర్ కాలనీ పార్క్‌కు మిరియాల ప్రీతమ్ వాటర్ కూలర్ విరాళం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీప్తిశ్రీ నగర్ కాలనీ పార్క్‌లో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మిరియాల ప్రీతమ్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ కూలర్‌ను విరాళంగా అందజేశారు. వేసవి కాలంలో కాలనీ వాసులకు శుద్ధమైన చల్లని తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీ అధ్యక్షుడు సీతారామయ్య చేతుల మీదుగా వాటర్ కూలర్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త మిరియాల రాఘవరావు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.

కార్యక్రమంలో మహిళలు, యువత, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. మిరియాల ప్రీతమ్ చేస్తున్న సేవలను కొనియాడారు. మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రకాష్ వర్మ, రీటా, సునీల్ రాజు, రాజు హనుమంతరావు, రవి, కవి రాజ్, సుమన్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here