ప్రకాష్ నగర్ శ్మ‌శాన వాటిక అభివృద్ధికి కృషి: గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ శ్మ‌శాన వాటికను బాలింగ్ గౌతమ్ గౌడ్ స్వయంగా సందర్శించారు. ప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, స‌గర సంఘం, క్రిస్టియన్ సంఘం సభ్యుల విన్నపం మేరకు శ్మ‌శాన వాటిక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో AE ప్రతాప్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ పాల్గొన్నారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం శ్మ‌శాన వాటికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గౌతమ్ గౌడ్ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కాలనీ అధ్యక్షుడు చింతకింది పవన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పరమేశ్వర్ ముదిరాజు, బెనర్జీ, రాజారాం, ఆంజనేయులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here