మదీనా గూడ‌లో రూ.4 కోట్లతో కొత్త పాఠశాల: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భూమిపూజ

శేరిలింగంప‌ల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లోని మదీనా గూడ గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌ను రూ.4 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పునర్నిర్మాణం చేపట్టడానికి విర్టుసా ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, విర్టుసా కంపెనీ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేయలేని పని బీజేపీ నాయకుల కృషి, ఎంపీ దిశానిర్దేశంతో ఈరోజు సాధ్యమైంద‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఆధునిక సౌకర్యాల‌ను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, విర్టుసా ఫౌండేషన్ ముందుకు రావడం సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు అని ప్రశంసించారు.

బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ విర్టుసా కంపెనీ రూ.4 కోట్లతో పాఠశాలను అభివృద్ధి చేస్తోంద‌ని, ఇది మాత్రమే కాకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరిన్ని కంపెనీలు ముందుకు రావాల‌ని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల కోరిక మేరకు 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహించేలా ప్రభుత్వ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిని మహేష్ యాదవ్, విర్టుసా ఫౌండేషన్ సభ్యులు కృష్ణ ఎద్దుల, వాసు, ఇందార్, పూజా, సుబ్బారావు, సురేష్ బాబు, అరుణ, కె.వి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, జితేందర్, సురేష్ యాదవ్, కుమార్ యాదవ్, విజయేందర్, పద్మ, వినయ, బిందు, శ్రీనివాస్ యాదవ్, మనోజ్, ప్రసాద్ రెడ్డి, శ్రీశైలం కురుమ, పార్వతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here