క‌రోనా ఉదృతిలో సేవ‌లందించిన మ‌హిళ సేవ‌కుల చిత్రాల‌తో కొత్త పోస్ట‌ల్ క‌వ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంను పుర‌స్క‌రించుకుని స‌రికొత్త పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను ఆవిష్క‌రించారు. న‌గ‌రంలోని ఢాక్ స‌ద‌న్‌లో సోమ‌వారం జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్‌‌సీపీసీఆర్ పూర్వ చైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ శాంత‌సిన్హా, తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్ ఎస్‌.రాజేంద్ర‌కుమార్‌లు నూత‌న పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా శాంతా సిన్హా మాట్లాడుతూ ఆధునిక యుగంలో ప్ర‌తి రంగంలో మ‌హిళ‌ల పాత్ర అద్వీతీయ‌మ‌ని, క‌రోనా విస్తృతిలోను స‌మ‌స్త మాన‌వాళికి సేవ‌లందించిన ‌పారిశుధ్య కార్మికురాలు, మ‌హిళా డాక్ట‌ర్‌, న‌ర్సు, పోలీస్‌, పోస్టుఉమెన్‌ల చిత్రాల‌తో కూడిన పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను విడుద‌ల చేసి వారిని గౌర‌వించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ రీజియ‌న్ పోస్ట్‌మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ విద్యాసాగ‌ర్ రెడ్డి, పోస్ట‌ల్ సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న ఎన్‌‌సీపీసీఆర్ పూర్వ చైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ శాంత‌సిన్హా, తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్ ఎస్‌.రాజేంద్ర‌కుమార్ త‌దిత‌రులు
మ‌హిళా సేవ‌కుల చిత్రాల‌తో రూపొందించిన కొత్త పోస్ట‌ల్ క‌వ‌ర్ ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here