నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్ధతుగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ డివిజన్ పరిధిలోని వీడియా కాలనీ హారిక టవవర్స్ ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులను, అపార్ట్మెంట్ వాసులను, పట్టభద్రులతో సమావేశమై వారి మొదటి(1) ప్రాధాన్యత ఓటును సురభివాణి దేవికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పధకాలను పరిగణలోకి తీసుకోవాలని, విద్యావంతురాలు, మాజీ ప్రధానీ పీవీ నర్సింహారావు కూతురు మద్ధతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉమాకిషన్, సుప్రజా, కాలనీ వాసులు వెంకట్, సుధాకర్, రాజశేఖర్, సీతారాం, కిషోర్, రవి,శ్రీకాంత్, నవీన్ లాల్, పర్ద, చంద్ర, సాయిరాం, మధు, సంబశివరవు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.






