నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. రాజకీయ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్టసేవలు అందజేస్తున్న మహిళలను సత్కరించి గౌరవించారు.
- మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి: ప్రభుత్వ విప్ గాంధీ

సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని, ప్రతీ మహిళ తానకు నచ్చిన రంగంలో సత్తా చాటి ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. సోమవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మహిళా సాధికారికత కు కృషి చేయాలని వారు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు తోడ్పాటునందించాలన్నారు. విరామం లేకుండా కష్టపడే తత్వం స్త్రీలకే సాధ్యమని , మహిళలు అభివృద్దిలోకి ముందుకు రావాలంటే ఒక విద్య తోనే సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా సాధికారికత కోసం ఎంత గానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు మంజుల, పద్మ ,కృష్ణ కుమారి, విమల,లత, సదా మాధవి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
- ఆరెకపూడి శ్యామల గాంధీకి మహిళల శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ సతీమణి శ్యామల దేవికి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు శుభాకాంక్షలు తెలిపారు.
- మహిళలు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి: రాగం సుజాత నాగేందర్‌యాదవ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్‌జికె చైల్డ్ రీసోర్స్ సెంటర్ లో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 200 మంది గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం అధికారి కిషన్, రజినీ, దినిష్, చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, ఆర్‌జికె సభ్యులు శ్రీకళ వార్డు సభ్యురాలు కవిత, గోపి, రాహుల్, దివ్య, నరేష్, అనురాజు, తులజ రాము, రిజ్వ, మమత, నాగమణి, షాబాన, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎంఐజి ఫేజ్ -4 లో స్థానిక నాయకులు సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ రాగం సుజాత యాదవ్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జార్జ్, మహిళలు కవిత గోపి, సరిత, వనజ, కృష్ణ కుమారి, పంకజం, సబిత, సునీత, మీనా, గంగా తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుజాత నాగేందర్‌యాదవ్ శుభాకాంక్షలు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ రాగం సుజాత యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను కలిసిన సుజాతనాగేందర్‌యాదవ్ పుష్ఫగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి కార్యాలయంలో…

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధరరెడ్డి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధరరెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని, ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా మహిళలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను తారానాగర్ లోని విద్యా నికేతన్ మోడల్ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి జంట సర్కిల్స్ పరిధిలో గల 50 కాలనీల్లో మహిళలకు గత వారం నిర్వహించిన ఆటలపోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రోఫెసర్ ఆచార్య సివి ఉష మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్,
కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను , విష్ణుప్రసాదు , శివరామకృష్ణ , జనార్దన్ , ఎమ్ ఎస్ నారాయణ , శ్రీమతి వాణి సాంబశివరావు , శ్రీమతి ఉమా చంద్రశేఖర్ , రాధారాణి , వరలక్ష్మి , చంద్రకళ , విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జయప్రకాష్‌నగర్‌లో…

మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పద్మావతి మహిళ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మియాపూర్ ఏస్ ఐ మౌనిక, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు హాజరయ్యారు. ఈ వేడుకల్లో నాయకురాలు రోజా, కాలనీ అధ్యక్షులు అనిరాజు, రాఘవరావు, మహిళ మండలి సభ్యులు రమాదేవి, సీత, కుమారి, గాయత్రి, ప్రతిభ, రాణి, గోవిందమ్మ, స్వాతిలతో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్‌లో…

చందానగర్ డివిజన్ పరిధిలోని మాధవ్ బృందావన్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆమె కేకు కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ వాసులు, మహిళలు పాల్గొన్నారు.
మియాపూర్‌లో పారిశుద్ధ్య మహిళా సిబ్బందికి సన్మానం…

చందానగర్ సర్కిల్ జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగపు అధికారులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో పారిశుద్ధ్య సిబ్బందిన ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్‌పి మహేష్, ఎస్ఎఫ్ఎలు నాగరాజు, గురుచరణ్, జితేందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో…

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో కుకట్‌పల్లి పీజేఆర్ నగర్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగదిరిగుట్ట సిఐ సైదులు, ఎస్సై రాములు, ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ సైదులు మాట్లాడుతూ మహిళలు ఎటువంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మహిళా వింగ్ చైర్ పర్సన్ గీతా రెడ్డి, డైరెక్టర్ సంధ్యారెడ్డి, హైదరాబాద్ జిల్లా చైర్మన్ వర్ధమాన్ మోహన్ చారి, కూకట్పల్లి జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మి, కార్యదర్శి సరస్వతి మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.