నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో కోటి అరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. భవిష్యత్తులో శాశ్వత సమస్య పరిష్కారమయ్యేలా వరద నీటి కాలువ నిర్మాణం పనులను చేపడతున్నట్లు ఆరెకపూడి గాంధీ చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.
