వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్‌లో డివిజన్ బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ పర్యటించారు. డ్రైనేజీలోని మట్టిని తీసి రోడ్డుపై వదిలేయడంతో డ్రైనేజీ మట్టిలో మురుగు రోడ్డుపై ప్రవహిస్తుండడాన్ని గమనించారు. దీంతో స్థానిక ప్రజలు దుర్వాసనతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నారు. కనుక అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీలో నుండి తీసిన మట్టిని వెంటనే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు నర్సింగ్, నవీన్, రాజు, వీర్రాజు గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.