నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామంలో డెవలప్‌మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్, మినిస్ట్రీ అఫ్ టెక్స్‌టైల్ గవర్నమెంట్ అఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో, మై హ్యాండ్లూమ్ – మై ప్రైడ్ ను శనివారం వీవెర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య చేనేత కళాకారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్స్ ఫో లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 75 మంది చేనేత ఉత్పత్తుల కళాకారులు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో నవంబర్ 12 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకమైన చేనేత చీరలు, చున్నీ లు, డ్రెస్ మెటీరియల్, హోమ్ డెకర్ ఫర్నిషింగ్స్, దార్రిస్, టేబుల్ రున్నేర్స్ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీదేవి తూపురాని శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వినాయక కౌతం, రామదాసు కీర్తన, వాని గణపతి, కృష్ణ శబ్దం, దేవా దేవం భజేయ, జతిస్వరం, తదితర అంశాలను కుమారి అనూష, సుమ శ్రీ హవ్య, గీతికా, లహరి, జాహ్నవి, శాన్వి, శృతిక ప్రదర్శించి మెప్పించారు.

