నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేసి, స్వతంత్ర భారత కీర్తిని నలుదిశలా చాటాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించి ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మియాపూర్ డివిజన్ లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ సుధాన్ష్, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
కొండాపూర్ డివిజన్ లో..
కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీ హాల్ లో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి సర్కిల్ జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా మన భారత దేశం అడుగులు వేయడంలో ప్రతి భారతీయుని పాత్ర ఉండాలన్నారు. సర్వమత సమ్మేళనంగా ముందుకు భారతీయులు కదిలి దేశ అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి సర్కిల్ జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, శానిటేషన్ డిపార్ట్ మెంట్ సూపెర్ వైజర్ యస్. జలంధర్ రెడ్డి, ఎస్సార్పీ రాజయ్య, సిబ్బంది, కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, షేక్ చాంద్ పాషా, నరసింహా సాగర్, గౌరీ, రూపరెడ్డి, రవి శంకర్ నాయక్, అశోక్ సాగర్, నీలం లక్ష్మి నారాయణ, కేశం కుమార్, మొహ్మద్ ఖాసీం, నీలం లక్ష్మణ్, ఎర్రరాజు, రవి గౌడ్, సాగర్ చౌదరి,స్వామి సాగర్, మధు ముదిరాజ్, సాయి శామ్యూల్ కుమార్, సంజీవ, పుణ్యవతి, రఫియా బేగం, దీపక్, ఆనంద్ చౌదరి, వినోద్, రవి, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ లో..
శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ లో జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆగస్టు 15 న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ నగేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు నరేందర్ బల్లా, కవిత తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ లో..
భారత స్వాతంత్య్ర వజ్రత్సోవ వేడుకల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్ క్లేవ్, సురక్ష హిల్స్, వేమన రెడ్డి కాలనీ, తదితర కాలనీలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరు తమ ఇంటి పై కుటుంబ సభ్యులు అందరూ కలిసి జాతీయ జెండాను ఎగరవేయాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.
అనంతరం శ్రీదేవి థియేటర్ లో స్కూల్ విద్యార్థులతో కలిసి భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర జీవిత చరిత్రపై రూపొందించిన గాంధీ చిత్రాన్ని చూశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వహీద్ అలీ, బిల్ కలెక్టర్ రాము, ఎస్ ఆర్ పీ బాలాజీ, కాలనీ వాసులు షైక్ హుస్సైన్, శ్రీశైలం, నిఖిల్ రెడ్డి, వీరేశం, నర్సింహులు, చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నాగి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి రెడ్డి , హరీష్ రెడ్డి , అమిత్ దూబే , అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
“గాంధీ” చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా గచ్చిబౌలి లోని పీవీఆర్ థియేటర్ లో ఉచితంగా ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్ కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తిలకించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతం అని, మహానీయులను స్మరించుకోవడం మన విధి అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.