నమస్తే శేరిలింగంపల్లి: భారత స్వాతంత్ర అమృతోత్సవాలలో ప్రతీ భారతీయుడు విధిగా భాగస్వాములు కావాలని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ ఘర్ పే తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు, వాకర్స్, సీనియర్ సిటిజెన్స్ కు త్రివర్ణ పతాకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
