నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్ అకాల మృతి పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శ్రద్ధాంజలి ఘటించారు. మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాత్ తో కలిసి జ్ఞానేంద్ర ప్రసాద్ పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించి, ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాధవరం గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
