తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ బీరప్ప ఆల‌యం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వ‌హించారు. తెలంగాణ విమోచన చరిత్రను స్మరించుకుంటూ ఆ కాలంలో రైతులు, మహిళలు, ప్రజలు నిఖార్సైన ధైర్యంతో నిజాం దోపిడీ, అణచివేతలకు ఎదిరించి పోరాడిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. నిజాం పాలనలోని అన్యాయాలు, పీడనలు, సాయుధ దళాల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం ఫలితంగానే ఈ నేల విముక్తి పొందిందని బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమర వీరుల త్యాగాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here