శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. లబ్ధిదారులకు మంజూరైన రూ.2.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతతో, సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు. సమాజానికి సేవ చేయడానికి, కష్టాల్లో ఉన్న వారికి తక్షణ సహాయం అందించేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. CMRF కార్యక్రమం వైద్య అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రూపొందించబడిందని, బాధితులను కష్టకాలంలో సమయానికి సహాయం చేసి ఆదుకునేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు.






