బక్రీద్ వేడుకల్లో ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంప‌ల్లి, మే 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బక్రీద్ పండుగ సందర్భంగా హైదర్ నగర్ డివిజన్‌లోని ఈద్గా వద్ద హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ త్యాగానికి, కరుణకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజల ప్రార్థనలన్నీ ఫలించి కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. ఈ పవిత్ర పర్వదినాన అల్లాహ్ ప్రతి ఒక్కరి ప్రార్థనలు, త్యాగాలను స్వీకరించి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈద్ ముబారక్ అని నార్నె శ్రీనివాస రావు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here