శేరిలింగంపల్లిలో బీజేపీ ఎస్‌ఐఆర్ సమావేశం.. నాయకులకు దిశానిర్దేశం చేసిన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి..

శేరిలింగంప‌ల్లి, మే 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఎస్‌ఐఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి నాయకులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాల అమలు, ఎన్నికల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మారబోయిన రవికుమార్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, ప్రొఫెషనల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బాల్దా అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరావు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ సభ్యుడు భరద్వాజ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి పద్మ, బీఎల్ఏ-2 నియోజకవర్గ ఇంచార్జీ మాణిక్ రావు, జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here