శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో ఇలియాస్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈద్-ఎ-బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈద్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ షరీఫ్, సబ్బేర్ షరీఫ్, అస్మత్ షరీఫ్, యాసిన్ షరీఫ్, మొహమ్మద్ షరీఫ్, యూనుస్ షరీఫ్, రోషన్, రుఖ్ముద్దీన్, దౌలత్ పాషా, ఆసిఫ్ పటేల్, మొసిన్, జావీద్, అఖిల్ తదితర కమిటీ సభ్యులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ వేడుకలు సోదరభావం, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలిచాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ప్రాంతీయ ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది.






