నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలని, హపీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనగుడ ప్రధాన రహదారిపై చేపడుతున్న నాలాల నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ, గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాల విస్తరణ పనులు శరవేగంగా చేపట్టి వార్షాకాలం లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. వరదలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతీ, ఏఈ అనురాగ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు అన్వర్ షరీఫ్, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.