రూ.5 ల‌క్ష‌ల ముఖ్య‌మంత్రి స‌హ‌యానిధి చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.5 ల‌క్ష‌ల నిధులు మంజూర‌య్యాయి. స‌ద‌రు చెక్కులను ల‌బ్ధిదారులైన‌ కొండాపూర్ డివిజన్ శ్రీరాం నగర్ కాలనీకి చెందిన జ్యోతి ల‌క్ష్మీ(రూ.3ల‌క్ష‌లు), కూకట్‌పల్లి డివిజన్‌ దీనబంధు కాలనీకి చెందిన ఆముల్యల‌కు గురువారం ప్ర‌భుత్వ విప్ గాంధీ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు కాశినాథ్ యాదవ్, ఆంజనేయులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేస్తున్న ప్ర‌భుత్వవిప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here