హుడాకాల‌నీలో జీహెచ్ఎంసీ కోవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని హుడాకాల‌నీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 పడకల కోవిడ్ ఐసోలేషన్‌ సెంటర్‌ను స్థానిక కార్పొరేట‌ర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌ల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఐసోలేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. అన్ని రాకల వసతులతో ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని, ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కోవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ను ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, జ‌డ్సీ ర‌వికిర‌ణ్‌, డీసీ సుధాంష్‌, వైద్యాధికారి ర‌వి, కార్పొరేట‌ర్లు మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి

నియోజ‌క‌వ‌ర్గంలోని కల్వరి టెంపుల్ లో 300 బెడ్ల‌తో, న్యాక్‌లో 200 బెడ్లతో, కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్ అధ‌నంగా 25 బెడ్ల‌తో దాత‌ల స‌హ‌కారంతో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం కోవిడ్‌తో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించటానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌ని అన్నారు. కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలాని, వైరస్‌వ్యాప్తి చెందకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంష్, జిల్లా వైద్యాధికారులు స్వరాజ్యల‌క్ష్మి, సృజన, స‌ర్కిల్ ఉప‌వైధ్యాధికారులు రవి, కార్తీక్, మాజీ కార్పొరేటర్ రంగరావు, టీఆర్ఎస్ హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఐసోలేష‌న్ సెంట‌ర్లో సౌక‌ర్యాల గురించి తెలుసుకుంటున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here