శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుడు పట్లోళ్ళ బలవంత్ రెడ్డి పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలవంత్ రెడ్డిని రాగం నాగేందర్ యాదవ్ సన్మానించారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. అనేకమంది విద్యార్థుల భవితకు బాటలు వేసిన ఉపాధ్యాయుడిగా గుర్తుండిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్ర రెడ్డి, పి.ఆర్.టి.యు టి.ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు సామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు హనుమంతు, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, స్టాఫ్ సెక్రటరీ ఉదయ్ కుమార్, పాఠశాల పీడి కేశవరెడ్డి, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, గఫుర్, రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






