వాహ‌న‌దారులు ట్రాఫిక్ రద్దీ నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి: ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వాహ‌న‌దారులు ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ తెలిపారు. మంగ‌ళ‌వారం మేడ్చ‌ల్ ట్రాఫిక్ డీసీపీ రంజ‌న్ ర‌త‌న్ కుమార్‌, కూక‌ట్‌ప‌ల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంక‌ట‌య్య‌, జీహెచ్ఎంసీ డీఈ శ్రీ‌దేవిల‌తో క‌లిసి మియాపూర్ జంక్ష‌న్‌, మియాపూర్ ఎక్స్ రోడ్డు బ‌స్టాప్‌, మియాపూర్ మెట్రో పిల్ల‌ర్ 600 యు ట‌ర్న్ త‌దిత‌ర ప్రాంతాల‌ను సీఐ ప్ర‌శాంత్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై వారితో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు, ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని అన్నారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వాహ‌న‌దారులు వాహ‌నాల‌ను న‌డిపించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here