శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో ఆయనను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్‌కు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి, ఓబిసి రాష్ట్ర సమన్వయకర్త హరి కిషన్, రంగారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అయాజ్ ఖాన్, NSUI అధ్యక్షుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.






