నమస్తే శేరిలింగంపల్లి: ఆర్టిజన్ కార్మికుల సమస్యల సాధనకై వరంగల్‌లో ఈనెల 5 తారీకున వరంగల్ నక్కలగుట్టలోని టీఎస్ఎన్‌పీడీసీఎల్ ముందు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని టీఎస్ఈఈయూ 327 రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్క కార్మికుడు హాజరై తమ ఐక్యత చాటాలని, యాజమాన్యం కళ్ళు తెరిచే వరకు అలుపెరుగని పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గం ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు సిద్ధంగా ఉండి కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి ఒక్క రెగ్యులర్ ఎంప్లాయ్, ఆర్టిజన్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, పీస్ రేట్ బిల్ కలెక్టర్లు, సబ్ స్టేషన్ ఆపరేటర్ లు, SPM కార్మికులు, స్టోర్ కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని చలో వరగంల్ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.